పుణే వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ భారత్ బ్యాటింగ్ విభాగం ప్రదర్శన పేలవంగా సాగింది. ఫలితంగా 113 పరుగుల తేడాతో భారత్ పై న్యూజీలాండ్ విజయం సాధించింది. మూడు మ్యాచ్ లను సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలిఉండగానే కివీస్ సొంతం చేసుకుంది. బెంగళూరు టెస్ట్ లోనూ భారత్ ఘోరంగా ఓడింది.
పుణే టెస్ట్ లో ప్రత్యర్థి న్యూజీలాండ్ విధించిన 359 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ నానా తంటాలు పడాల్సి వచ్చింది. టాప్ ఆర్డర్ లో యశస్వీ జైస్వాల్ (77) మాత్రమే రాణించాడు. కివీస్ బౌలర్ మిచెల్ శాంట్నర్ విజృంభణకు భారత బ్యాటర్లు తక్కువ స్కోర్ కే పెవిలియన్ బాటపట్టారు.
గిల్ (23), కోహ్లీ(17), రిషబ్ పంత్ (0), వాషింగ్టన్ సుందర్ ( 21), సర్ఫరాజ్ ఖాన్ (9) విఫలం అయ్యారు. రవీంద్ర జడేజా (42) పరుగులు చేసి ఆఖరి వికెట్ గా వెనుదిరిగాడు. అశ్విన్ (18), ఆకాశ్ దీప్(1) బుమ్రా(10*) నిరాశపరచడంతో భారత్ ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్ లో 60.2 ఓవర్లు ఆడిన భారత్ 245 పరుగులకే ఆలౌట్ అయింది.
కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆరు వికెట్లు పడగొట్టగా అజాజ్ పటేల్ రెండు వికెట్లు, ఫిలిప్స్ ఒక్క వికెట్ పడగొట్టారు.
భారత్, 2012 తర్వాత స్వదేశంలో జరిగిన సిరీస్ ను కోల్పోవడం ఇదే మొదటిసారి.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల