బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌పై మరో హత్యాయత్నం కేసు నమోదైంది. బీజేపీ నేత, మంత్రి సత్యకుమార్ యాదవ్‌పై గతేడాది దాడికి సంబంధించి ప్రస్తుతం కేసు నమోదైంది. వైసీపీ సానుభూతిపరుడిగా పేరున్న బోరుగడ్డ అనిల్ కుమార్ ను కూడా ఈ కేసులో చేర్చారు. ఈ కేసులో ఏ1గా నందిగం సురేశ్, ఏ2గా బోరుగడ్డ అనిల్ ఉన్నారు.
గత ఏడాది అమరావతిలో జరిగిన రైతు ఉద్యమాల్లో బీజేపీ అగ్రనేత సత్యకుమార్ యాదవ్, సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. మార్చి 31న అమరావతి ఉద్యమంలో భాగంగా మందడంలో నిర్వహించిన సమావేశానికి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. అక్కడ రైతులను ఉద్దేశించి ప్రసంగించి తిరుగు వెళుతుండగా మూడు రాజధానుల శిబిరం వద్ద కొందరు దాడి చేశారు.
అప్పటి బాపట్ల ఎంపీ నందిగం సురేశ్, బోరుగడ్డ అనిల్ ఈ దాడిలో పాల్గొన్నట్లు ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు అందింది. దాడికి పాల్పడాలంటూ నందిగం సురేశ్ తన అనుచరులను రెచ్చగొట్టినట్లు బీజేపీ యువజన నాయకుడు సురేశ్ వివరించారు. సంఘటన జరిగిన సమయంలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. దీంతో శుక్రవారం మళ్లీ ఫిర్యాదు చేశామన్నారు.