పుణె టెస్ట్ పై పట్టుబిగించే దిశగా న్యూజీలాండ్ ప్రయత్నిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ పై 301 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో భాగంగా ఐదు వికెట్లు నష్టపోయి 198 పరుగులు చేసింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 259 పరుగులు చేయగా భారత్ 156 పరుగులకే పెవిలియన్ చేరింది. దీంతో భారీ ఆధిక్యంపై న్యూజీలాండ్ కన్నేసింది.
రెండోరోజు ఆటలో భాగంగా కివీస్ జట్టు 53 ఓవర్లు ఆడింది. 103 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజీలాండ్, వికెట్ పడకుండా ఆడేందుకు మొగ్గుచూపుతోంది.
టామ్ లాథమ్ (88) రాణించగా, డేవిన్ కాన్వే(17), విల్ యంగ్ (23), రచిన్ రవీంద్ర(9), డేరియల్ మిచైల్ (18) విఫలమయ్యారు. రెండో రోజు ఆట నిలిపివేసే సమయానికి క్రీజులో పటామ్ బ్లండెల్( 30), గ్లెన్ పిలిఫ్స్ ( 9) క్రీజులో ఉన్నారు.
వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్ల తీయగా ఓ వికెట్ ను రవిచంద్రన్ అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు.