కెనడా లో ఘోరం జరిగింది. టొరంటో సమీపంలో ఓ టెస్లా కారు ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పాయారు. మృతుల్లో ఇద్దరు గుజరాత్ రాష్ట్రంలోని గోద్రాకు చెందిన వారిగా గుర్తించారు.
గోద్రా కు చెందిన కేతా గోహిల్(30), నిల్ గోహిల్(26),మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి టెస్లా కారులో ప్రయాణిస్తున్నారు. టొరంటో సమీపంలో డివైడర్ను ఢీ కొట్టింది. దీంతో కారులో మంటలు రేగి ప్రాణాలు కోల్పోయారు.
అదే మార్గంలో ప్రయాణిస్తున్న వారు, మంటలు అదుపు చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. చనిపోయినవారిలో ఇద్దరికీ ఇటీవలే కెనడా పౌరసత్వం లభించినట్లు తేలింది.