న్యూజీలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా పుణె మ్యాచ్ లోనూ టీమిండియా బ్యాటింగ్ లో విఫలమైంది. పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది.
ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా భారత జట్టు స్వదేశంలో న్యూజీలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ ఓడింది.
న్యూజీలాండ్ స్పిన్నర్ల ధాటికి ఓపెనర్లలో యశస్వి జైస్వాల్(30) ఫర్వాలేదనిపించగా కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్( 30), విరాట్ కోహ్లి(1) రిషభ్ పంత్(18), సర్ఫరాజ్ ఖాన్(11) నిరాశపరిచారు. రవీంద్ర జడేజా (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అశ్విన్( 4), వాషింగ్టన్ సుందర్ (18*), ఆకాశ్ దీప్( 6), జస్‌ప్రీత్ బుమ్రా( 0) పరుగులు చేశారు.
కివీస్ బౌలర్లలో స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్ ఏడు వికెట్లు తీయగా, గ్లెన్ ఫిలిప్స్ రెండు , టిమ్ సౌతీ ఒక వికెట్ దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో కివీస్ జట్టు పది వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది.