కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘క’ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ మూవీకి సుజిత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ఈ సినిమా విడుదల కానుందని మేకర్స్ తెలిపారు.
ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలతో ట్రైలర్ ఉండటంతో ఈ సినిమాపై అభిమానుల అంచనాలు పెరిగాయి. కిరణ్ అబ్బవరం నటన, సంభాషణలు, యాక్షన్ సన్నివేశాలు బాగా ఉన్నాయని అభిమానులు చెబుతున్నారు. కిరణ్ అబ్బవరంకు జోడిగా తన్వీ రామ్ నటించింది.