సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి పదవీకాలం నవంబరు 10తో ముగియనుంది. నవంబరు 11న కొత్త ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పష్టం చశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ సిఫార్సు మేరకు సంజీవ్ ఖన్నాను నియమించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా 2025 మే 13 వరకు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు.