కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని రైల్వే లైనుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.2245 కోట్లతో 57 కి.మీ కొత్త రైల్వే లైను నిర్మాణం చేయనున్నారు. కృష్ణా నదిపై 3.2 కి.మీ రైల్వే వంతెన నిర్మించనున్నారు. అమరావతి రాజధానిని హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా రైల్వే లైనుతో అనుసంధానం చేయనున్నారు.
అమరావతి రాజధాని మీదుగా అమరావతి బౌద్ధ క్షేత్రాన్ని కలుపుతూ రైల్వే లైను వేయనున్నారు. ఉండవల్లి గుహల సమీపంలోనూ రైల్వే స్టేషన్ రానుంది. బందరుపోర్టు, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను అమరావతి రాజధానితో అనుసంధానం చేయడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో డీపీఆర్ సిద్దం చేసి టెండర్లు పిలవనున్నారు.