పల్నాడు జిల్లా దాచేపల్లి పరిధిలో డయేరియా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అంజనిపురం కాలనీలో అతిసారం కారణంగా గురువారం ఇద్దరు మృతి చెందారు. అపరిశుభ్ర వాతావరణం కారణంగా స్థానికులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
దాచేపల్లికి చెందిన తమ్మిశెట్టి వీరయ్య, వెంకటేశ్ అనే ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరికొందరు చికిత్సపొందుతున్నారు.
మంత్రి నారాయణ, పల్నాడు జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
దాచెపల్లిలోని నీటిని విజయవాడ ల్యాబ్‌కు పంపించాలని ఆదేశించారు.బోర్లను అన్నింటిని మూసివేసి వాటర్ ట్యాంక్‌ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు.మురికి కాల్వలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని ఆదేశించారు. స్థానికంగా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.