లైంగిక వేధింపుల కేసులో నెల రోజులుగా చంచలగూడ జైల్లో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేషనల్ అవార్డు తీసుకునేందుకు ఈ నెల మొదటి వారంలో కోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసింది. అయితే ఫోక్సో కింద కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్‌కు ప్రకటించిన అవార్డుకు రద్దు చేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.
తనను పలు మార్లు షూటింగులకు తీసుకెళ్లి జానీ మాస్టర్ అత్యాచారం చేశాడంటూ సహాయ కొరియోగ్రాఫర్ ఒకరు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలిపై మొదటి సారి అత్యాచారం జరిగినప్పుడు 18 సంవత్సరాలు నిండకపోవడంతో జానీ మాస్టర్‌పై పోలీసులు ఫోక్సో కింద కేసు నమోదు చేశారు. దీనిపై ఇవాళ విచారించిన కోర్టు జానీ మాస్టర్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.