ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లి నివాసం వద్ద కొండచిలువ కలకలం రేపింది. కరకట్ట సమీపంలోని మీడియా పాయింటు వద్ద కొండచిలువ ఓ జంతువును మింగి చనిపోయి ఉండటాన్ని కొందరు గుర్తించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అటవీ శాఖ అధికారులు పరీక్షించారు.
మేకను మింగి కొండచిలువ చనిపోయినట్లు గుర్తించారు. చనిపోయిన కొండచిలువను అక్కడ నుంచి తొలగించారు.
కరకట్ట ప్రాంతంలో గుట్టలు పెరిగిపోవడంతో కొండచిలువ అక్కడకు వచ్చిందని అనుమానిస్తున్నారు. అమరావతి రాజధానిలో జంగిల్ క్లియర్ చేయడంతో అటవీ జంతువులు బయటకు వస్తున్నాయని సమాచారం. అడవి పందులు, కొండచిలువలు ఇటీవల కాలంలో అమరావతి ప్రాంతంలో పెద్దఎత్తున జనసంచారంలోకి రావడం కలకలం రేపుతోంది.