సభ్యసమాజం తలదించుకునేలా ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మృగాడు దారుణానికి ఒడిగట్టాడు. తల్లితో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆమెకు తెలియకుండా కూతురుతో ప్రేమాయణం కొనసాగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒంగోలుకు సమీపంలోని గ్రామంలో ఓ మహిళ, ఆమె కుమార్తె జీవిస్తున్నారు. భర్తతో విడిపోయిన మహిళను
పొందూరుకు చెందిన బండ్లా రాజు లొంగదీసుకున్నాడు. గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ప్రతి రోజూ ఆమె కూతురుని పాఠశాల వద్ద దింపి వస్తూ నమ్మకంగా ఉంటున్నాడు.
రెండు రోజుల కిందట ఒంటరి మహిళ కూతురికి మాయమాటలు చెప్పి బండ్లా రాజు లేపుకెళ్లాడు. రాత్రి పది గంటలకు కూడా కూతురు ఇంటికి రాకపోవడం, రాజు కనిపించకపోవడంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు రాజు, బాలికను హైదరాబాద్లో గుర్తించారు. రాజుపై ఫోక్సో కేసు నమోదైంది.