దేశంలో వేగంగా పెరుగుతోన్న పప్పుల ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్దమైంది. ఇప్పటికే భారత్ బ్రాండ్ ద్వారా నిత్యావసరాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం శనగపప్పు, మసూర్ పప్పులను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కేంద్రీయ భండార్ నెట్వర్క్, జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య ద్వారా పప్పులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.
భారత్ బ్రాండ్ దుకాణాల ద్వారా కిలో శనగపప్పు రూ.58, కిలో మసూర్ పప్పు రూ.89కే అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 3.5 లక్షల టన్నుల శనగపప్పు, 68 వేల టన్నుల మసూర్ దాల్ సిద్దం చేసింది. త్వరలో సహకార సంఘాల ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు.