బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. రాబోయే 24 గంటల్లో ఈ తుపాను ఒడిషాలోని పూరీ సాగర్ మధ్య తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో తీరంలో గంటలను 120 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే ప్రమాద ముందని హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా 200కుపైగా రైళ్లను రద్దు చేశారు. భువనేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావంతో ఒడిషా, బెంగాల్, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలుకురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్ర వెల్లడించింది.
తుపాను ప్రభావంతో ఆంధ్రా తీరంలోనూ గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే 24 గంటల్లో ఒడిషాల్లో 20 సెం.మీ పైగా వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. దీని ప్రభావం 36 గంటల వరకు ఉంటుందని అంచనా. శుక్రవారం రాత్రి దానా తుపాను తీరందాటే అవకాశం కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం కూడా అధికారులను అప్రమత్తం చేసింది.