భారత్ న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న మూడు టెస్ట్ మ్యాచ్‌ల సీరీస్‌లో రెండో మ్యాచ్ ఈ ఉదయం పుణేలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన అతిథి జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
సీరీస్‌లోని మొదటి మ్యాచ్ గెలిచిన కివీస్, అదే ఊపును కొనసాగించాలని భావిస్తోంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మొదలైన ఈ మ్యాచ్‌లో గెలవక తప్పని పరిస్థితిలో భారత్ ఉంది. గత పన్నెండేళ్ళలో స్వదేశంలో ఎప్పుడూ ఓడిపోని రికార్డును కొనసాగించాలన్నా, ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో హ్యాట్రిక్ సాధించే అవకాశాలను మెరుగుపరచుకోవాలన్నా భారత్ ఈ మ్యాచ్ గెలిచి తీరాలి.
రెండో టెస్ట్ ఆడే జట్టులో భారత్ మూడు మార్పులు చేసింది. కులదీప్, కెఎల్ రాహుల్, సిరాజ్‌లకు బదులు వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్, ఆకాశ్‌దీప్ జట్టులోకి వచ్చారు. న్యూజీలాండ్ జట్టులోనూ ఒక మార్పు జరిగింది. మ్యాట్ హెన్రీ బదులు మిషెల్ శాంట్నర్ ఆడుతున్నాడు.
రెండో టెస్ట్ ఆడుతున్న జట్లు ఇలా ఉన్నాయి:
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌దీప్, జస్ప్రీత్ బుమ్రా
న్యూజీలాండ్: టామ్ లాథామ్ (కెప్టెన్), డేవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిషెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, మిషెల్ శాంట్నర్, టిమ్ సౌదీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓ రౌర్క్
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు