లవ్ జిహాద్ కోరలు ఝార్ఖండ్ గిరిజన ప్రాంతాల్లో సైతం కాటువేస్తున్నాయి. ఈ కేసులో పట్టుబడిన నిందితుడు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, ఒక హిందూ బాలికను మాత్రమే రక్షించగలిగారు, ఎంతోమంది హిందూ బాలికలు ఇస్లాంలోకి మారిపోయి ముస్లిం యువకులను పెళ్ళిచేసుకోడానికి సిద్ధంగా ఉన్నారంటూ పోలీసులకే చెప్పడం విశేషం.
ఝార్ఖండ్‌లో తాజాగా వెలుగుచూసిన లవ్ జిహాద్ కేసు ఇది. బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు చేసిన ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి… పదిహేనేళ్ళ మైనర్ హిందూ గిరిజన బాలికను ఇన్స్టాగ్రామ్ ద్వారా అద్నాన్ అనే ముస్లిం యువకుడు పరిచయం చేసుకున్నాడు. మెల్లగా ఆమెను ప్రేమలోకి దింపాడు. తనతో ఢిల్లీకి పారిపోడానికి ఆ బాలికను ఒప్పించాడు.
అక్టోబర్ 13 నుంచీ బాలిక కనబడకుండా పోయిందని తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత అద్నాన్ తమకు ఫోన్ చేసి, తామిద్దరమూ పీకలదాకా ప్రేమలో ఉన్నామనీ, మరిన్ని వివరాలు బాలిక స్నేహితురాళ్ళు తరుణ, దీక్షలకు తెలుసనీ చెప్పాడు. ఇలాంటి బాలికలను రక్షించే స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న అంబికా రాయ్ అనే మహిళ వద్ద, ఈ బాలిక తల్లి పనిచేస్తుండడం యాదృచ్ఛికం. అంబికా రాయ్ బాలిక తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి తీసుకువెళ్ళారు. అక్కడున్న ముస్లిం అధికారి బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదును తీసుకోడానికి సైతం నిరాకరించాడు. అంబికారాయ్ గట్టిగా నిలదీసాక ఎట్టకేలకు ఆ అధికారి ఫిర్యాదు స్వీకరించాడు.
ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని తెలిసాక అద్నాన్ బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసాడు. తన మీద ఎలాంటి చట్టపరమైన చర్యలూ తీసుకోవద్దనీ, అలా చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారనీ బెదిరించాడు. తనకు ఢిల్లీలో పెద్దపెద్దవాళ్ళు తెలుసంటూ వారిని భయపెట్టాడు.
అయితే పోలీసులు ఫిర్యాదు రిజిస్టర్ చేసాక, అద్నాన్ ఫోన్ నెంబర్ ద్వారా అతని జాడ కనిపెట్టి ఫోన్ చేసారు. దాంతో దిగివచ్చిన అద్నాన్, బాలికను ఝార్ఖండ్ రైలు ఎక్కిస్తున్నానని చెప్పాడు. అక్కడకు వెళ్ళిన పోలీసులకు బాలిక దొరకలేదు. అద్నాన్‌ను పట్టుకుని నిలదీస్తే ఆమె అదే రైల్లో ఉందని తెలిసింది. అయితే అప్పటికే ఆమెకు హిజాబ్ తొడిగినందున ఆమెను పోలీసులు గుర్తించలేకపోయారు.
బాధిత బాలికను పోలీసులు కౌన్సెలింగ్‌కు తీసుకువెళ్ళారు. అద్నాన్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే పోలీసు విచారణలో భాగంగా అద్నాన్ ఒక బాలిక తప్పించుకున్నంత మాత్రాన పోయేదేమీ లేదని, ఎంతోమంది హిందూ బాలికలను ఇప్పటికే ట్రాప్ చేసామనీ, వారు మతం మార్చుకుని పెళ్ళిళ్ళు చేసుకోడానికి, బురఖాలు తొడుక్కోడానికీ సిద్ధంగా ఉన్నారనీ వెల్లడించాడు. దాన్నిబట్టి, హిందూ మైనర్ బాలికలను ట్రాప్ చేసేందుకు పెద్ద ముఠాయే పనిచేస్తోందని అర్ధమవుతోంది. ఆ రాకెట్‌ను ఛేదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.