కేంద్ర పౌరవిమానయాన శాఖ భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన డ్రోన్ షో విజయవంతమైంది. డ్రోన్ సమ్మిట్ లో భాగంగా విజయవాడ పున్నమి ఘాట్ లో ఏర్పాటు చేసిన ఈ భారీ ఈవెంట్ లో వివిధ రకాల విన్యాసాలు చూసి వీక్షకులు మురిసిపోయారు.
ఈ డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులు నమోదు చేసింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు సంబంధిత సర్టిఫికెట్లు అందజేశారు.
డ్రోన్లను ఉపయోగించి అతి పెద్ద భూగోళం ఆకృతి , అతి పెద్ద ల్యాండ్ మార్క్, అతి పెద్ద విమానం, అతి పెద్ద జాతీయ జెండా, ఏరియల్ లోగో రూపొందించగా ఈ ఐదు అంశాల్లో విజయవాడ డ్రోన్ షో ప్రపంచ రికార్డు సాధించింది. దాదాపు 5,500 డ్రోన్లను ఈ షోలో ఉపయోగించారు. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.