హైదరాబాద్ పాతబస్తీ రెయిన్‌బజార్ ప్రాంతంలో అక్టోబర్ 20 ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక యువకుడు ఒకరు దైవదూషణ చేసాడంటూ ఆరోపణలు రావడంతో పెద్దసంఖ్యలో ముస్లిములు రోడ్డు మీదకు చేరుకున్నారు. ఒక వ్యక్తి పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ మహమ్మద్ ప్రవక్త గురించి అభ్యంతరకరంగా ఉందంటూ మండిపడిన ముస్లిం మూక, ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకూ చెలరేగిపోయారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం రెయిన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఒక 20ఏళ్ళ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసాడు. అందులో ఉన్న సమాచారం అభ్యంతరకరంగానూ, రెచ్చగొట్టేదిగానూ ఉందని కొందరు ముస్లిములు భావించారు. వారి పిలుపు మేరకు కొన్ని వందలమంది ముస్లిములు రోడ్లమీదకు వచ్చేసారు. ఆ కుర్రాడి మీద చర్యలు తీసుకోవాలంటూ గోల చేసారు. ‘సర్ తన్ సే జుడా’ (తలను శరీరం నుంచి వేరు చేసేయాలి) అంటూ నినాదాలిచ్చారు.
యాకూత్‌పురా బ్రాహ్మణవాడిలోని మహంకాళి పోచమ్మ ఆలయం దగ్గర ఒక కుటుంబం మీద 60 మంది ముస్లిముల మూక గుంపుగా వెళ్ళి దాడి చేయడంతో పరిస్థితి మరింత విషమించింది. ఆ కుటుంబాన్ని చంపేస్తామంటూ ఆ గుంపు బెదిరించింది. దాంతో గుడి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోలీస్ స్టేషన్ ఆ పక్కనే ఉన్నా, పోలీసులు ఏ చర్యా తీసుకోకుండా ఉండిపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసారు.
ముదురుతున్న ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేయడానికి బదులు పోలీసులు ఆ గుడి ప్రాంగణంలోని వారిని అక్కడినుంచి ఖాళీ చేసి మౌనంగా వెళ్ళిపోవాలని చెప్పారని ప్రత్యక్షసాక్షులు వివరించారు.
ఈ మొత్తం వ్యవహారం మీద పోలీసులు స్పందించలేదు. పరిస్థితిని అదుపు చేయవలసిన తాము ఎందుకు జోక్యం చేసుకోలేదన్న విషయాన్ని కూడా వారు వివరించలేదు.
ఇదేదో ఆకస్మికంగా జరిగిన యాదృచ్ఛిక సంఘటన కాదు. గత కొద్దినెలలుగా ముస్లింలు మూకుమ్మడిగా రహదారుల మీదకు వచ్చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం, ఎవరైనా మాట్లాడిన మాటలు తమకు అభ్యంతరకరంగా అనిపిస్తే వెంటనే వాళ్ళ తలలు నరికేయాలంటూ నినాదాలివ్వడం పరిపాటిగా మారింది. సెప్టెంబర్, అక్టోబర్ రెండు నెలల్లోనే అలాంటి నాలుగు సంఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు సైతం ముస్లిములు ఏం చెప్పినా దానికి జీ హుజూర్ అంటూ తలొగ్గిపోతున్న సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి.
అక్టోబర్ 19 రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఒక హిందూ వ్యక్తి తమ దైవాన్ని దూషించాడని ఆరోపిస్తూ ముస్లిములు ‘సర్ తన్ సే జుడా’ నినాదాలు చేస్తూ స్థానిక పోలీస్‌స్టేషన్‌ను చుట్టుముట్టి రచ్చ చేసారు.
సెప్టెంబర్ 16న ఉత్తరప్రదేశ్‌లోని సిద్దార్ధనగర్‌లో బారావఫాత్ ఊరేగింపు స్థానిక శివాలయం మీదుగా వెడుతుండగా ముస్లిములు ‘గుస్తాఖ్ ఎ నబీ కీ ఏక్ సజా, సర్ తన్ సే జుడా’ నినాదాలు చేసారు. ప్రవక్తను అవమానిస్తే తల నరికేయడం ఒక్కటే శిక్ష అని దాని అర్ధం. ఆ వీడియో స్థానికంగా వైరల్ అయ్యాక, పోలీసులు ఆ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు.
సెప్టెంబర్ 29న యూపీలోని గజియాబాద్‌లో అటువంటి పరిస్థితే తలెత్తింది. స్థానిక దస్నా ఆలయానికి చెందిన యతి నరసింహానంద సరస్వతి ఒక బహిరంగ సభలో చేసిన ప్రసంగం మీద ముస్లిములు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ ఆలయ పూజారి తల నరికేయాలంటూ నినాదాలు చేసారు. స్వామి ప్రసంగం వీడియోలోని ఒక వాక్యాన్ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ అవడంతో పరిస్థితి మరింత దిగజారింది. రెచ్చిపోయిన ముస్లిములు రోడ్ల మీదకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసారు.
అక్టోబర్ ప్రారంభంలోనే యూపీలోని బహ్రయిచ్‌లో దారుణం జరిగింది. బురఖా వేసుకున్న ముస్లిం మహిళలు గుడిలోకి ప్రవేశించి అక్కడ హిందూ దేవీదేవతలను అవమానించారు. ఆ వీడియోను ఒక ముస్లిం యువకుడు షేర్ చేసాడు. ఓ హిందూ బాలుడు దాన్ని ఖండిస్తూ ఆ అంశంపై సోషల్ మీడియాలో ఆ ముస్లిం యువకుడి పోస్టుకు రిప్లైలు పెట్టాడు. దాంతో ఆ బాలుడి ఇంటిముందు వెయ్యిమందికి పైగా ముస్లిములు గుమిగూడి ఆ పిల్లవాడితో క్షమాపణ చెప్పించారు. అతని తల నరికేస్తామని తీవ్రంగా బెదిరించారు.
ఇలా రోజురోజుకూ హిందూ దేవాలయాలపైన, వాటిలోని వస్తుసామగ్రి పైనా దాడులు జరుగుతూనే ఉన్నాయి. హిందువుల తలలు నరికేయాలంటూ ముస్లిములు గొడవ పడుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోడానికి, అల్లరిమూకలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా కఠినమైన చట్టం చేయాలని హిందువులు కోరుతున్నారు.