ఏపీలో ఇక నుంచి విద్యార్థుల కష్టాలు తీరనున్నాయి. పలు సర్టిఫికెట్ల కోసం విద్యార్ధులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఆన్లైన్లో సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫోన్‌కే సర్టిఫికెట్లు పంపించేందుకు ఏపీ ప్రభుత్వం మెటాతో ఒప్పందం చేసుకుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, మెటా కంపెనీ ప్రతినిధులతో ఢిల్లీలో ఎంఓయూ చేసుకున్నారు.
ఇక నుంచి విద్యార్థులు పలు సర్టిఫికెట్ల కోసం తిరిగాల్సిన పనిలేదని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. పాదయాత్ర సమయంలో పలువురు విద్యార్థులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, అందుకే ఈ ఒప్పందం చేసుకున్నట్లు లోకేశ్ చెప్పారు.