తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ ( weather report) వెల్లడించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. తూర్పుతీర రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా స్పష్టం చేసింది. రాబోయే రెండు రోజుల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని కూడా ఐఎండీ ( heavy rains )హెచ్చరించింది.
గడచిన 24 గంటల్లో ఏపీలో పలు చోట్ల 2 నుంచి 4 సెం.మీ వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లాలో అతి భారీ వర్షాలకు చెరువులకు గండ్లు పడ్డాయి. పలు గ్రామాలు నీట మునిగాయి. రాబోయే రెండు రోజుల్లో ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.