అతిసారతో ప్రాణాలు కోల్పోయిన విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. అతిసారతో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరణించిన వారి కుటుంబసభ్యులను పవన్ పరామర్శించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
చంపావతి నదిలో నీరు కలుషితం కావడం వల్లే అతిసార వ్యాపించిందని గుర్తించినట్లు పవన్ చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా నీటిని మూడు దశల్లో శుద్ధి చేసి సరఫరా చేయాలని ఆదేశించారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చంపావతి నది నీరు కలుషితం కావడానికి గల కారణాలను అన్వేషించాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.