టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాల పర్యటనలో అల్లు అర్జున్‌పై కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది.
144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అల్లు అర్జున్ పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారంటూ నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును క్వాష్ చేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు.
అల్లు అర్జున్ పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. దీనిపై విచారించడానికి హైకోర్టు అంగీకారం తెలిపింది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.