వాలంటీరు జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను పోలీసులు తమిళనాడులోని మధురైలో అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దుర్గాప్రసాద్ హత్య కేసులో శ్రీకాంత్ ఏ వన్‌గా ఉన్నారు. మూడేళ్ల కిందటే హత్య జరిగినా కేసు ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక,పోలీసులు మరలా కేసు విచారణ ప్రారంభించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కుమారుడు శ్రీకాంత్ మూడు రోజుల కిందటే పరారయ్యాడని పోలీసులు చెబుతున్నారు.
జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో డీజీపిని బాధితుడి కుటుంబసభ్యులు కలిశారు. కేసు విచారణ చేయాలంటూ అభ్యర్థించారు. దీంతో పోలీసులు కేసును మరలా విచారణ ప్రారంభించారు. గత వారం ఈ కేసులో ఓ అనుమానితుడిని విచారించగా, మాజీ మంత్రి పినిపె తనయుడి పేరు ప్రముఖంగా వినిపించినట్లు సమాచారం. పోలీసులు అదుపులోకి తీసుకున్న శ్రీకాంత్‌ను ట్రాన్సిట్ వారెంట్‌పై ఇవాళ సాయంత్రానికి ఏపీకి తరలించనున్నారని తెలుస్తోంది.