జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గాందర్బల్ జిల్లా గుండ్ సమీపంలోని జాతీయ రహదారి వద్ద ఇద్దరు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక డాక్టర్ సహా ఆరుగురు కార్మికులు చనిపోయారు. శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారి పనులు ముగించుకుని క్యాంపునకు వచ్చిన కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఏడుగురు అక్కడే చనిపోగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై జమ్ముకశ్మీర్ ఐజీ వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టారు. అమాయకులను పొట్టనబెట్టుకున్నారని ఉగ్రవాదులు ఇలాంటి పిరికిపంద చర్యలు మానుకోవాలని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా హెచ్చరించారు.కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులను వదిలేదే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం సైన్యం రంగంలోకి దిగింది.