విజయనగరం జిల్లా గుర్లలో అతిసార మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. కలుషిత నీరు తాగడంతో గత వారం రోజల్లోనే చికిత్స పొందుతూ ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుర్లలో వైద్య శిబిరం కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.
గుర్ల అతిసార మృతుల వ్యవహారం తేల్చేందుకు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్‌తో విచారణకు ఆదేశించింది. త్వరలో విచారణ చేపట్టనున్నారు. పైపులు మరమ్మతులు చేయకపోవడం వల్ల, తాగే నీటిలో మురుగునీరు చేరిందని అనుమానిస్తున్నారు. దీనిపై వైద్య,ఆరోగ్య మంత్రి సత్యకుమార్ స్పందించారు. మాజీ సీఎం జగన్ రెడ్డి చేసిన పాపాలు ప్రజలను పీడిస్తున్నాయన్నారు.