మనిషి చనిపోయిన తరవాత వారి విలువ సున్నా అని అందరూ భావిస్తూ ఉంటారు. అయితే జపాన్ ప్రభుత్వం మాత్రం చనిపోయిన వారి అంత్యక్రియల బూడిద నుంచి కూడా ఆదాయం తీస్తోంది. అది ఎలాగో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
జపాన్‌లో చనిపోయిన వారిని దహనం చేస్తూ ఉంటారు. అలాంటి వారి చితాభస్మాన్ని నదుల్లో కలుపుతుంటారు. అయితే చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించిన తరవాత ఆ బూడదలో పల్లాడియా, టైటానియంలాంటి విలువైన లోహాలు ఉంటాయని జపాన్ ప్రభుత్వం గుర్తించింది. దంతాల తయారీకి, దంతాల మధ్య ఖాళీలు పూరించడానికి డెంటిస్టులు ఈ మెటల్ వాడుతుంటారు. ఇక చనిపోయిన తరవాత అంత్యక్రియలు పూర్తి చేయగా వచ్చిన బూడిద నుంచి జపాన్ ప్రభుత్వం విలువైన లోహాలు సేకరిస్తోంది.
గత కొద్ది సంవత్సరాల్లో చనిపోయిన 15 లక్షల మంది చితాభస్మం నుంచి సేకరించిన పల్లాడియం, టైటానియం ద్వారా జపాన్ రూ.400 కోట్ల ఆదాయం సంపాదించింది. ఈ మొత్తం శ్మశానాల అభివృద్ధికే ఖర్చు చేయనున్నట్లు జపాన్ ప్రకటించడం విశేషం.