వైసీపీ ఎమ్మెల్సీపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను రూ.65 వేలకు విక్రయించాంటూ బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైసీపీ ఎమ్మెల్సీ జకియాఖానంపై కేసు నమోదైంది. తమకు ఆరు టికెట్లను రూ.65 వేలకు విక్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
ప్రజాప్రతినిధులు తిరుమల శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలు ఇచ్చే సంప్రదాయం నెలకొంది. అయితే వాటిని విక్రయించుకోవడానికి వీల్లేదు. ప్రతి నెలా పరిమితి మేరకు ప్రజాప్రతినిధులు లేఖలు ఇవ్వవచ్చు. అయితే గత కొంత కాలంగా ఆలాంటి లేఖలను విక్రయించుకుంటున్నట్లు తెలుస్తోంది.