చైనా, తైవాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. సైనికులు యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలంటూ ఇటీవల ఓ బ్రిగేడ్ సమావేశంలో చైనా అధ్యక్షుడు షీ జెన్‌పింగ్ సూచించినట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.సైన్యం అప్రమత్తంగా ఉండాలని ఎప్పుడు యుద్ధం వచ్చినా, అలర్ట్‌గా ఉండాలంటూ చైనా అధ్యక్షుడు సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించినట్లు తెలుస్తోంది.
తైవాన్, చైనా మధ్య ఉద్రిక్తతల వేళ జిన్‌పింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే సైనికుల సమావేశాల్లో సహజంగా సన్నద్ధంగా ఉండాలంటూ సూచిస్తూ ఉంటారు. జిన్‌పింగ్ ఆ ఉద్దేశంతో చెప్పారా? లేదంటే తైవాన్‌తో యుద్ధానికి దిగి ఆ దేశాన్ని ఆక్రమించాలని చూస్తున్నారా? అనే విషయంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.