పోలీసుల దొంగ వేషాలు ఉద్యోగాలు పోయేలా చేశాయి. తూర్పుగోదావరి జిల్లా
పెరవలి స్టేషన్ పరిధిలో గత నెల జూదగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.6.45 లక్షలు స్వాధీనం చేసుకుని, రికార్డుల్లో మాత్రం రూ.55 వేలుగా నమోదు చేశారు. దాడి సమయంలో ఓ వ్యక్తి పెరవలి స్టేషన్ పోలీసుకు లక్ష ఇచ్చి దాచాలంటూ సూచించాడు. తరవాత పోలీసులు జూదగాళ్లను అరెస్ట్ చేశారు.వారికి స్టేషన్ బెయిల్ మంజూరు చేసి పంపించారు. ఆ తరవాతే అసలు విషయం బయటపడింది.
కానిస్టేబుల్‌కు లక్ష ఇచ్చిన వ్యక్తి తన డబ్బు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో ఆ పోలీస్ ఆ డబ్బును రూ.6.45 లక్షల్లో కలిపేశానంటూ చెప్పాడు. వారి మధ్య వాగ్వాదం జరిగింది. సీసీ టీవీ ఫుటేజీ బయట పెట్టడంతో అది జిల్లా ఎస్పీకి చేరింది. విచారణ జరిపిన జిల్లా ఎస్పీ ఎస్సై అప్పారావు, సీఐ శ్రీనివాసరావు, రైటర్, మరో ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.