సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ టెక్ మహింద్రా క్యూ 2 నికరలాభం రెండు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ 2 సేల్స్ రూ.12863 కోట్లు కాగా, ఈ ఏడాది రూ. 13313 కోట్లకు పెరిగింది. క్యూ 2లో కంపెనీ నికరలాభం రూ.1250 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం నికరలాభం రూ.493 కోట్లు మాత్రమే. ఆస్తుల అమ్మకం ద్వారా కంపెనీ భారీ లాభాలను ఆర్జించింది. కంపెనీకి చెందిన భవనాలు, స్థలాలు అమ్మకం ద్వారా రూ.450 కోట్లు సంపాదించారు.
పాత ఖాతాదారులను కాపాడుకుంటూ కంపెనీ, కొత్త కస్టమర్లను ఆకర్షిస్తోంది. కంపెనీకి లభించిన ఆర్డర్లు కూడా భారీగా పెరిగాయని సీఈవో తెలిపారు. క్యూ2లో కంపెనీ 6500 మందిని కొత్తగా నియమించుకుంది. దీంతో ఉద్యోగుల సంఖ్య లక్షా 54 వేలకు చేరింది.