దేవాలయాలపై దాడులను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ హైదరాబాద్‌లో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గత కొంతకాలంగా కొందరు దుండగులు ఆలయాలపై దాడులకు దిగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గత వారం సికింద్రాబాద్ కుమ్మరిగూడ అమ్మవారి ఆలయం గేట్లు బద్దలు కొట్టి, అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో దుండగులను కఠినంగా శిక్షించాలంటూ విశ్వ హిందూ పరిషత్ ఆందోళన చేపట్టింది.
నిరసన తెలుపుతోన్న వీహెచ్‌పీ కార్యకర్తపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేపట్టిన సచివాలయ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో గ్రూప్ వన్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు.