విమానాలకు బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 24 గంటల్లోనే 20 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో వాటిని దారి మళ్లించడం, అత్యవసరంగా దించడం ద్వారా అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో గంటల కొద్దీ విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఎయిరిండియా, విస్తారా, ఆకాశ్, ఇండిగో సంస్థలకు చెందిన 20 విమానాలను అత్యవసరంగా దించి తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో అధికారులు, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.
గడచిన వారంలోనే 70 విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. బెదిరింపు కాల్స్ చేస్తున్న వారిపై నిషేధం విధించాలని చూస్తోన్నట్లు పౌరవిమానయాన మంత్రి రాంమ్మోహన్నాయుడు స్పష్టం చేశారు.
ప్రయాణీకుల భద్రతే తమకు ముఖ్యమని ఎలాంటి బెదిరంపు కాల్స్ వచ్చినా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొందరు కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పుడుతన్నట్లు నిఘా సంస్థల ద్వారా తెలుస్తోంది.