వైసీపీ విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యానారాయణ కార్యాలయాలు, ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హయగ్రీవ రియల్ ఎస్టేట్ పేరుతో ఆయన పలు నిర్మాణాలు చేపట్టారు. ఇటీవల ఓ వివాహం సందర్భంగా వందల కోట్ల రూపాయలు హవాలా మార్గంలో మళ్లించారనే సమాచారంతో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖలో రెండేళ్ల కిందట రూ.1200 కోట్లతో కొనుగోలు చేసిన భూముల వ్యవహారంలోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.
మాజీ ఎంపీ ఎంవీవీ 2006 నుంచి 2008 మధ్య కాలంలో కొన్ని తెలుగు చిత్రాలు నిర్మించారు. హవాలా మార్గంలో డబ్బు తరలించారనే ఆరోపణలపై ఈడీ కేసులు నమోదు చేసింది. తాజాగా రియల్ వ్యవహారాల్లోనూ వందల కోట్ల రూపాయలు హవాలా మార్గంలో మళ్లించారనే సమాచారంతో ఈడీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న అన్విత రియల్ ఎస్టేట్ కంపెనీలోనూ వేల కోట్లు హవాలా డబ్బు పెట్టుబడులు పెట్టారని గురువారం ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.