బంగాళాఖాతంలో మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 22వ తేదీన ఏర్పడే అల్పపీడనం వాయుగుండగా మారుతుందని అంచనా వేశారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర, దక్షిణ కోస్తాతోపాటు, రాయలసీమ జిల్లాల్లో 22 నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
గడచిన 24 గంటల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో 2 నుంచి 4 సెం.మీ వర్షపాతం నమోదైంది. అల్పపీడనం ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. నేడు, రేపు తేలికపాటి వర్షాలు, 22 నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది.