ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్టోబరు 20 నాటికి బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఏర్పడి, 48 గంటల తరవాత అది వాయుగుండంగా మారనుందని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురేసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మరో తుపాను హెచ్చరికలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. గత వారం నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ఇప్పుడిప్పుడే వరద నుంచి జనం బయట పడుతున్నారు. మరో వాయుగుండం వచ్చే ప్రమాదం పొంచి ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.