సాప్ట్వేర్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. నికరలాభాలు అంచనాలను మించాయి. రెండో త్రైమాసికంలో సంస్థ రూ.40986 కోట్ల టర్నోవర్‌పై రూ. 6506 నికరలాభం సాధించింది. గత ఆర్థికసంవత్సరం రెండో త్రైమాసికంలో ఇది రూ. 6212 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం కన్నా 4.7 శాతం అధికంగా నికరలాభం సాధించింది. రెండేళ్ల తరవాత మొదటిసారిగా సిబ్బంది సంఖ్య కూడా పెరిగింది. మొత్తం ఉద్యోగులు 317868కు చేరారు.ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 20 వేల మందిని తీసుకోనున్నట్లు కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.
ఇన్ఫోసిస్ ఫలితాలు స్టాక్ మార్కెట్లకు ఊతం ఇచ్చాయి. వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలతో పాటు ఐటీ రంగం మరలా ఊపందుకోవడంతో పెట్టుబడిదారులు భారీగా కొనుగోళ్లుకు దిగారు. రాబోయే కొద్దరోజుల్లో ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలు కూడా స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలిచ్చాయి.