బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. బిష్ణోయ్ గ్యాంగ్ నీ జోలికి రాకుండా ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ దుండగులు బెదిరించారు. ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఈ సమాచారాన్ని మేసేజ్ ద్వారా పంపించారు. దీన్ని తేలిగ్గా తీసుకోవద్దంటూ కూడా హెచ్చరించారు. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రత పెంచారు. మేసేజ్ ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు పంపారనే దానిపై విచారణ సాగుతోంది.
గత వారం ఎన్సీపీ నేత సిద్దిఖీని చంపినట్లే సల్మాన్ ఖాన్‌ను హతమారుస్తామంటూ దుండగులు మెసేజ్ పంపించారు. సల్మాన్‌కు బెదిరింపులు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలోనే అనేకసార్లు బెదిరింపులు వచ్చాయి. ఏప్రిల్ మాసంలో సల్మాన్ ఇంటి వద్ద ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. అదే సమయంలో కొందరు దుండగులు ఆయన ఫామ్ హౌసులోకి దూరే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.
తరచూ బెదిరింపులు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్‌కు భద్రత పెంచింది. ఆయనకు వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. తాజా బెదిరింపులతో ఆయన ఇంటి వద్ద పోలీసులను మోహరించారు.