మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నటి తమన్నాను విచారించారు. క్రిప్టో కరెన్సీ మైనింగ్ పేరుతో హెచ్పిజడ్ టోకెన్ మొబైల్ యాప్ నిర్వాహకులు వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ యాప్ ప్రమోషన్ కార్యక్రమాల్లో నటి తమన్నా భాటియా పాల్గొన్నారు. దీంతో ఈడీ అధికారులు ఆమె నుంచి సమాచారం సేకరించేందుకు గువహటిలో విచారించారు. ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని తెలిపారు. నటి తమన్నాను విచారించి వెంటనే వదిలేశారు.
హెచ్పిజడ్ టోకెన్ మొబైల్ యాప్ నిర్వాహకులు క్రిప్టో కరెన్సీ మైనింగ్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలొస్తాయంటూ రూ.2 వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దోచుకుని విదేశాలకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ యాప్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పొల్గొన్న నటీనటులను కూడా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అందులో భాగంగానే నటి తమన్నా భాటియాను విచారించినట్లు ఈడీ ప్రకటించింది.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జనగ్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు : వైఎస్ షర్మిల