బెంగళూరు టెస్ట్ రెండోరోజు ఆటలో న్యూజీలాండ్, భారత్ పై అన్ని విభాగాల్లో ఆధిక్యం ప్రదర్శించింది. భారత్ ను 46 పరుగులకే ఆలౌట్ చేసిన కివీస్, బ్యాటింగ్ లోనూ పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ లో 50 ఓవర్లు ఆడిన న్యూజీలాండ్, మూడు వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేసింది. తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ పై 134 పరుగుల ఆధిక్యం సాధించింది.
న్యూజీలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ , 49 బంతులు ఆడి 15పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ కాన్వే మాత్రం భారత బౌలర్ల నుంచి భారీగా పరుగులు రాబట్టాడు. 105 బంతులు ఆడి 91 పరుగులు చేశాడు. అశ్విన్ వేసిన 39.1 బంతిని ఆడబోయి ఔట్ అయ్యాడు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన యంగ్(33)పరుగులు చేసి రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. రవీంద్ర జడేజా బౌలింగ్ లో కుల్దీప్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
తొలిరోజు ఆట ముగిసే సమయానికి రచిన్ రవిచంద్ర(22) , మిచేల్ (14) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, రవీంద్రజడేజా, అశ్విన్ తలా ఒక వికెట్ తీశారు.