ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి చెందిన నిఖిత పోర్వాల్ ఈ ఏడాది దక్కించుకున్నారు. ముంబైలో ఈవెంట్‌లో నిఖిత విజయం సాధించారు. రేఖా పాండే, ఆయుశీ దోలకియా మొదటి, రెండవ రన్నరప్‌లుగా నిలిచారు. గతేడాది విజేత నందిని గుప్తా, నిఖిత పోర్వాల్ కు కిరీటాన్ని అలంకరించారు.
నిఖిత, ప్రపంచ అందాల పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. 60వ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పోటీలో పాల్గొన్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన నిఖిత పోర్వాల్, ‘ఈ ఆనందం మాటల్లో చెప్పలేను. నా తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూసి గర్వంగా ఉంది’. అని వ్యాఖ్యలు చేశారు.