బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఈ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 18 నాటికి ఆమెను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరచాలని ఐసీటీ తీర్పు చెప్పింది. గత జూన్ 15 నుంచి చెలరేగిన అల్లర్లలో వందలాది మంది చనిపోయారు. రిజర్వేషన్ల చిచ్చు బంగ్లాను కుదిపేసిన సంగతి తెలిసిందే. దీంతో హసీనా పదవికి రాజీనామా చేసి, భారత్లో ఆశ్రయం పొందుతోంది.
షేక్ హసీనాపై బంగ్లాదేశ్లో అనేక కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమె కోర్టులో హాజరుకావాల్సి ఉంది. హసీనాను బంగ్లాకు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రధాని యూనస్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ నుంచి భారత్ చేరుకున్న హసీనా డిప్లొమాటిక్ పాసు పోర్టు కూడా రద్దు చేశారు. అయితే ఆమెను బంగ్లాకు అప్పగించే విషయంలో భారత్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.