ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు
హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ, రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ, నాయబ్ సింగ్ సైనీతో ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు.ఎన్డీయే కి చెందిన 18 మంది ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచకులలోని పరేడ్ గ్రౌండ్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.
హర్యానా శాసనసభాపక్ష నేతగా నాయబ్ సింగ్ సైనీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హర్యానాలో బీజేపీ వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చింది. 90 స్థానాలకు గాను 48 చోట్ల విజయం సాధించింది. ఎన్నికలకు ముందు నాయబ్ సింగ్ సైనీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అంతకు ముందు మనోహర్ లాల్ ఖట్టర్ సీఎంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయంతో మళ్ళీ నాయబ్ కు సీఎంగా అవకాశం దక్కింది.