ఎట్టకేలకు నలుగురు ఐఏఎస్ అధికారులు తెలంగాణ నుంచి ఏపీ ప్రభుత్వంలో చేరారు. డీఓపీటీ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆమ్రపాలి, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, వాణీప్రసాద్లను బుధవారం రిలీవ్ చేసింది. వారు తాజాగా ఏపీ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్‌కు రిపోర్ట్ చేశారు. వారికి పోస్టింగులు కేటాయించాల్సి ఉంది.
రాష్ట్ర విభజన తరవాత తెలంగాణలో పనిచేయడానికి మొగ్గుచూపిన నలుగురు ఐఏఎస్ అధికారులు ఏపీ ప్రభుత్వంలో చేరారు. హైకోర్టుకు వెళ్లినా వారికి ప్రయోజనం దక్కలేదు. ఆ నలుగురిని వెంటనే ఏపీ ప్రభుత్వంలో చేరాలని ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సీఎస్‌కు రిపోర్ట్ చేశారు. త్వరలో వారికి ఏపీ ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వనుంది.