బెంగళూరు టెస్ట్ లో భారత్ ప్రదర్శన అత్యంత పేలవంగా సాగింది. లంచ్ బ్రేక్ సమయానికి ఆరు వికెట్లు నష్టపోయి 34 పరుగులు చేసిన రోహిత్ సేన, ఆ తర్వాత కూడా అదే చెత్త ప్రదర్శనను కొనసాగించింది. ఏకంగా ఐదుగురు ఆటగాళ్ళు డకౌట్ గా వెనుదిరిగారు.
న్యూజీలాండ్ బౌలర్లను ఏ ఒక్క భారత ఆటగాడు కూడా సమర్థంగా ఎదర్కోలేకపోయారు. రిషబ్ పంత్ (20) టాప్ స్కోరర్ గా ఉన్నాడు. 49 బంతులు ఆడి 20 పరుగులు చేశాడు. ఆ తర్వాత వరుసలో జైశ్వాల్ (13)ఉన్నాడు. జైశ్వాల్ అయితే 13 పరుగుల కోసం 63 బంతులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
టీమ్ ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, జడేజా, అశ్విన్ డకౌట్‌గా వెనుదిరిగారు. రోహిత్ శర్మ(2), జస్ప్రీత్ బుమ్రా(1), కుల్దీప్ యాదవ్(2)విఫలం అయ్యారు. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి సిరాజ్ (4*) నాటౌట్ గా ఉన్నాడు.
మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లు తీయగా, విలియమ్ ఓరూర్కీ నాలుగు వికెట్లు తీశారు. టిమ్ సౌతీ ఓ వికెట్ పడగొట్టాడు.
భారత జట్టు 1969 తర్వాత అత్యల్ప స్కోర్ చేయడం ఇదే.1969లో హైదరాబాద్ వేదికగా న్యూజీలాండ్‌తో జరిగిన టెస్టులో భారత్ 6వ వికెట్ పడే సమయానికి 27 పరుగులు చేసింది.