సంపూర్ణ మద్యనిషేధం అమల్లో ఉన్న బిహార్ లో కల్తీ మద్యం ఘటన కలకలం రేపుతోంది. కల్తీ మద్యం తాగి 20 మంది ప్రాణాలు విడిచారు. సివాన్, సారణ్ జిల్లాల పరిధిలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్లు సివాన్ ఎస్పీ అమితేశ్ కుమార్ తెలిపారు.
కల్తీ మద్యం విక్రయాలను అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ బీట్ పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.
సివాన్, సారణ్ జిల్లాలకు చెందిన కొందరు అక్టోబరు 15న కల్తీ మద్యం తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.
బిహార్ లో మద్యం వినియోగం, విక్రయాలపై 2016 ఏప్రిల్లోనే పూర్తిగా నిషేధం విధించారు. అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.