వాన కారణంగా ఆట నిలిచే సమయానికి 12.4 ఓవర్లలో భారత్ స్కోర్…13/3…
బెంగళూరు వేదికగా భారత్-న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వర్షం మరోసారి అంతరాయం కల్పించింది. తొలిరోజు ఆట టాస్ కూడా పడకుండా వాయిదా పడింది. ఇక, రెండు రోజు 15 నిమిషాలు ముందే ప్రారంభమైనప్పటికీ 12.4 ఓవర్ల తర్వాత వానకారణంగా ఆట నిలిచిపోయింది.
అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మాత్రం తీవ్ర కష్టాల్లో ఉంది. 12.4 ఓవర్లకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. కేవలం 13 పరుగులు మాత్రమే చేయగల్గింది.
కివీస్ పేసర్లు, మనోళ్ళకు చుక్కలు చూపిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ(2) విఫలం కాగా, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. క్రీజులో యశస్వీ జైశ్వాల్(8), రిషబ్(3) ఉన్నారు.
రెండు పరుగులు చేసిన రోహిత్ శర్మ, టిమ్ సౌథీ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.విలియమ్ బౌలింగ్ లో కోహ్లీ వెనుదిరగగా, హెన్రీ దెబ్బకు సర్ఫరాజ్ ఖాన్ ఔట్ అయ్యాడు. ఫిట్నెస్ కారణంగా శుభమన్ గిల్ ఆటకు దూరమయ్యాడు. పేసర్ ఆకాశ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కింది.