నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర కేసులో మరో కీలక నిందితుడిని ముంబై పోలీసులు హర్యానాలో అరెస్ట్ చేశారు. ఇవాళ నిందితుడిని ముంబై కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న సల్మాన్ నివాసం వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనపై సల్మాన్ ఖాన్ ముంబై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. కేసు నమెదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలించి కీలక వ్యక్తికి అరెస్ట్ చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్ 14న ముంబై శివారులోని పన్వేల్ ఫామ్‌హౌస్ వద్ద సల్మాన్ ఖాన్‌ను (salmankhan) హత్య చేయాలని బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర పన్నిందని పోలీసులు గుర్తించారు. ఫామ్ హౌసు వద్ద కారులో, లేదా షూటింగ్స్ సమయంలో హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు చెబుతున్నారు. సల్మాన్ హత్యకు బిష్ణోయ్ రూ.25 లక్షల సుఫారీ కూడా ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. సల్మాన్ హత్యకు ముగ్గురు మైనర్లకు సుపారీ చెల్లించినట్లు ముంబై పోలీసులు చెబుతున్నారు.