బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం (cyclone) ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో తీరందాటింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి కుండపోత వర్షాలు (heavy rains) కురుస్తున్నాయి. గడచిన రెండు రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 15 నుంచి 32 సెం.మీ వర్షపాతం (weather news) నమోదైంది. కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆకస్మిక వరదలు విరుచుకుపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
గడచిన 24 గంటల్లో నెల్లూరు జిల్లా వెంకటగిరి, కావలి, నెల్లూరు పట్టణాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. తిరుపతిలో పలు కాలనీలు నీట ముగిగాయి. తిరుమలలో కాలినడక మార్గాలను మూసివేశారు. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కృష్ణపట్నం ఓడరేవులో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.కళింగపట్నంలో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉత్తరాంధ్రలోనూ అతి భారీ వర్షాలు (ap rains) కురుస్తున్నాయి. వీటి ప్రభావంతో వరదలు వచ్చే ప్రమాద ముందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.