ఏపీ సీఎం చంద్రబాబునాయుడును దుర్భాషలాడిన గుంటూరుకు చెందిన రౌడీషీటర్, వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2024 జూన్‌లో అసెంబ్లీ ఫలితాలు వచ్చిన రోజు నుంచి బోరుగడ్డ అనిల్ (bougadda anilkumar)కనిపించకుండాపోయారు. అతనిపై రౌడీషీట్ తెరిచారు. బెదిరింపులు, హత్య కేసులు నమోదయ్యాయి. 2021లో గుంటూరుకు చెందిన ఓ వ్యక్తిని బెదిరించి 50 లక్షలు డిమాండ్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత బుధవారం మొదటిసారిగా బోరుగడ్డ అనిల్ గుంటూరు వచ్చారు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు.