న్యూజీలాండ్, భారత్‌ల మధ్య బెంగళూరు వేదికగా జరగాల్సిన తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ పడకుండానే మొదటి రోజు ఆట రద్దు అయింది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తొలిరోజు ఆటను రద్దు చేస్తున్నట్లుఅంపైర్లు ప్రకటించారు.
తొలిరోజు ఆట కొనసాగకపోవడంతో రెండో రోజు ఆట సమయంలో మార్పులు చేశారు. రెండో రోజు 15 నిమిషాల ముందుగానే ఉదయం సెషన్ ప్రారంభం కానుండగా ఉదయం సెషన్ 9.15 గంటల నుంచి 11.30 వరకూ ఉంటుంది. మధ్యాహ్నం సెషన్ 12.10 నుంచి 2.25 వరకు, చివరి సెషన్ 2.45 నుంచి 4.45 వరకూ కొనసాగేలా మార్పులు జరిగాయి. వాతావరణం అనుకూలిస్తే 98 ఓవర్ల పాటు ఆట జరగనుంది.
న్యూజీలాండ్, భారత్ మధ్య 62 టెస్ట్ మ్యాచ్ లు జరిగాయి. ఇందులో భారత్ 22 సార్లు విజయం సాధించగా, న్యూజీలాండ్ 13 సార్లు మాత్రమే నెగ్గింది. మిగతా 27 మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. ఇందులో భారత్ వేదికగా 36 మ్యాచ్ లు జరగగా 17 సార్లు భారత్ గెలవగా, న్యూజీలాండ్ రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది. భారత్ లో జరిగిన మ్యాచుల్లో 1988 లో కివిస్ తొలసారి విజయం సాధించింది.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల